ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఆది నుంచి తడబాటుకు గురయ్యింది. 353 పరుగుల టార్గెట్‌ని ఛేజింగ్ చేసే క్రమంలో త్వర త్వరగా వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో 66 పరుగుల తేడాతో భారత్‌పై ఆసిస్ జట్టు విజయం సాధించింది. కాగా, తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయగా టీమిండియాకు భారీ టార్గెట్ సెట్ చేసింది. ఆసీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 352 పరుగులుచేయగా ఇండియా 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే.. టాప్ ఆర్డర్ పర్వాలేదు అనిపించినా మిడిలార్డర్ పెద్దగా ఆటతీరు కనబర్చలేదు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఇండియా స్కోరు 286 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది.
ఇందులో రోహిత్ (81), వాషింగ్టన్ సుందర్ (18), కోహ్లీ (56), రాహుల్ (26), సూర్యకుమార్ (8) పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ ((48), రవీంద్ర జడేజా (35), పరుగులు చేయగా.. మిగతా టెయిలెండర్స్ సింగిల్ డిజిట్స్‌కే అవుటయ్యారు. ఈ మ్యాచ్‌లో ఆసిస్ బౌలర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు నాలుగు వికెట్లు దక్కగా, హాజిల్ వుడ్ 2, మిచ్చెల్ స్టార్క్ 1, పాట్ కమిన్స్ 1, తన్వీర్ సంగ్హా 1 వికెట్ తీసుకున్నారు.