భారత్, ఆసిస్ మహిళా జట్ల మధ్య ఇవ్వాల (గురువారం) జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ సెమీస్లో భారత్ 173 పరగులు టార్గెట్తో బరిలో దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ మహిళా జట్టు భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసిన ఆసిస్.. ఇండియాకి 173 పరుగుల లక్ష్యం పెట్టగా.. భారత్ దీటుగా బదులిచ్చింది. అయితే.. దూకుడుగా ఆడే క్రమంలో కాస్త భారత జట్టు తడబడింది. ఈ క్రమంలో వరుస వికెట్లు పోగొట్టుకుని కష్టాల్లో పడింది.
కాగా, డ్యాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (9) మొదటి ఓవర్లోనే ఎల్బీ డబ్ల్యూగా పెవిలిచన్ చేరింది. ఇక.. రెండో ఓవర్లో మరో ఓపెనర్ సృతి మంధాన (2) పరుగుల వద్ద సేమ్ టు సేమ్ ఎల్ బీ డబ్ల్యూగా ఔటయ్యింది. దీంతో అతి తక్కువ ఓవర్లలోనే భారత్ రెండు కీలక వికెట్లు పోగొట్టుకుంది.