భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 11, శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో స్టార్ట్ అవ్వనుంది. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన రోహిత్ సేన.. మూడో మ్యాచ్‌లో గెలిచి వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని మరోవైపు వెస్టిండీస్ భావిస్తోండగా.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, ఓపెనర్ శిఖర్ ధావన్‌తో సహా నలుగురు ఆటగాళ్లు కరోనా పాజిటివ్ కారణంగా ఈ సిరీస్ మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఇప్పుడు ధావన్ పునరాగమనం తర్వాత, ఆఖరి మ్యాచ్‌లో కాంబినేషన్ మారిపోవచ్చు.
మొదటి రెండు మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్, రెండో మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఓపెనర్లుగా వచ్చారు. మూడో మ్యాచ్‌లో మాత్రం శిఖర్ ధావన్ ఆడబోతున్నాడు. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ మిడిలార్డర్‌లో ఆడే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి వెస్టిండీస్‌ను 176, 193 పరుగులకు పరిమితం చేశారు. ఇప్పుడు సిరీస్ గెలిచిన తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ కొన్ని మార్పులు చేసి కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించవచ్చు. ఎడమచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గాయం నుంచి కోలుకోగా అతనికి ఛాన్స్ రావచ్చు. అదే జరిగితే, యుజ్వేంద్ర చాహల్ లేదా వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరు ఔట్ కావచ్చు.
వెస్టిండీస్ Probable XI: న్క్రుమా బోన్నర్, షాయ్ హోప్, షమ్రా బ్రూక్స్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ (సి), జాసన్ హోల్డర్, అకిల్ హోస్సేన్, ఫాబియన్ అలెన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్.
భారత్ Probable XI: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(WK), KL రాహుల్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్/దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్/అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ.