Saturday, November 23, 2024

లంకతో నేడే చివరి వన్డే..

జోరు మీదున్న టీమిండియ శ్రీలంకతో సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేకు సిద్ధమైంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భారత్‌ యోచిస్తోంది. మరోవైపు ఆఖరి పోరులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంక పట్టుదలగా ఉంది. ఇక మూడో వన్డేలో టీమిండియాలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది…పృథ్వీ షా స్థానంలో మరో యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ స్థానంలో సంజూ సామ్సన్‌ కూడా తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. సిరీస్‌లో విశేషంగా రాణిస్తో న్న స్పిన్‌ ద్వయం కుల్దీప్, చహల్‌లకు విశ్రాంతి ఇచ్చి రాహుల్‌ చహర్, కృష్ణప్ప గౌతమ్‌లను ఆడించొచ్చు.

మరోవైపు ఆఖరి పోరులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంక పట్టుదలగా ఉంది. ముఖ్యంగా అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక, అసలంక, కెప్టెన్‌ దసున్‌ షనక, కరుణరత్నే, హసరంగ ఈ సిరీస్‌లో విశేషంగా రాణిస్తున్నారు. వీరందరూ చివరి వన్డేలోనూ ఆడితే భారత్‌కు శ్రీలంక గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి : నేటి నుంచే ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం..

Advertisement

తాజా వార్తలు

Advertisement