భారత్-శ్రీలంక మధ్య కాసేపట్లో తొలి వన్డే జరగనుంది. శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయు..కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ప్రకటన అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఆ ప్రాంతంలో మేఘాలు కమ్ముకోవడంతో మ్యాచు రద్దయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేగాక మైదానం కూడా సముద్ర తీరంలోనే ఉంటుంది. ఆ ప్రాంతంలో తేమ ఎక్కువగా ఉండటంతో బంతి స్వింగ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మూడు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆర్ ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇది కూడా చదవండి : ఎలుక చేసిన పనిపై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్