కేప్ టౌన్ – భారత్ బౌలర్లు విజృంభణతో సపారీలు రెండో ఇన్నింగ్స్ లోనూ ఓ మోస్తరు స్కోర్ కు ఆల్ ఔటయ్యారు..
ఓవర్‌నైట్ 62/3 స్కోరుతో నేడు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 176 పరుగులకు కుప్పకూలింది.. ఓపెనర్ గా వచ్చిన మార్కమ్ సూపర్ శతకంతో సపారీలను ఆదుకున్నాడు.. ఒక వైపు వికెట్లు పడుతున్నా వన్డే బ్యాటింగ్ చేశాడు .. అతడు 106 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో వెనుతిరిగాడు .. కాగా భారత్ గెలవాలంటే 79 పరుగులు చేయాల్సి ఉంది.
ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకుకు
తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన బెడింగ్హామ్ (11) అదే ఓవర్ చివరి బంతికి కీపర్ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో 66 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. మరో బ్యాటర్ ఐదెన్ మార్క్రమ్ దూకూడుగా ఆడుతూ (106) అధ్బుత సెంచరీ సాధించాడు. ముకేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 21.1వ ఓవర్లో బుమ్రా విసిరిన అద్భుతమైన బంతిని ఆడబోయిన వెరీన్ (9) సిరాజ్ చేతికి చిక్కాడు. దీంతో 85 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్‌ను నష్టపోయింది. మరో బ్యాటర్ జాన్సన్‌ను (11) అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో (23.5వ ఓవర్) బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం వచ్చిన కేశవ్ (2)ను కూడా బుమ్రా ఔట్ చేశాడు రబాడ 2, నిగిడి 8 పరుగులు చేసి ఇంటి దారి పట్టారు.. ఈ మ్యాచ్ లో బూమ్రాకు 6 వికెట్లు కుప్పకూల్చాడు.. ముఖేష్ కు రెండు వికెట్లు, ప్రసిద్ధి కృష్ణ,సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.