Friday, November 22, 2024

India vs Pakistan CWC 2023 – టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భార‌త్… బ్యాటింగ్ చేయనున్న పాక్

అహ్మదాబాద్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2023లో అసలుసిసలైన సమరానికి టాస్ పడింది. క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరు భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది… నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్ ప్ర‌త్య‌క్షంగా వీక్షీంచేందుకు ల‌క్షా 30 వేల మంది అభిమానులు హాజ‌ర‌య్యారు.. టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరును ప్రదర్శించగా.. పాక్‌ కూడా రెండు విజయాలనుందుకుని దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇది ఇలా ఉంటే ప్ర‌పంచ క‌ప్ టోర్నిలో పాకిస్తాన్ జ‌ట్టు ఒక్కసారి కూడా గెలువ‌లేదు.. మొత్తం ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ఏడు మ్యాచ్ లు జ‌ర‌గ‌గా, అన్నింటిని భార‌త్ గెలుచుకుని అజేయంగా ఉంది.. ఈ మ్యాచ్ లో ఇరుజ‌ట్ల బ‌ల‌బ‌లాలు స‌మానంగా ఉన్నాయి.. వ‌త్తిడిని జ‌యించి ఆడిన జ‌ట్టుకే విజ‌యం వ‌రిస్తుంద‌ని క్రీకెట్ విశ్లేష‌కులు అంటున్నారు..

ఇక ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ స్థానంలో శుభ‌మ‌న్ గిల్ చేరాడు..

భారత్‌ (అంచనా): రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మాన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ , జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దిప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌.

పాకిస్తాన్‌ (అంచనా): అబ్దుల్లా షఫీక్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (వికెట్‌ కీపర్‌) , సౌద్‌ షకీల్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, షహీన్‌ షా అఫ్రిది, హసన్‌ అలీ , హారిస్‌ రవూఫ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement