ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వరుణుడు విరోధిలా నిలిచినా.. ఊహించినట్లుగానే ఆరో రోజుకు చేరింది. ‘రిజర్వ్ డే’ కారణంగా మ్యాచ్ ఫలితం కోసం ఇరు జట్లు ఇంకా పోరాడుతున్నాయి. భారత్, న్యూజిలాండ్ మాత్రం శక్తి వంచనలేకుండా పోరాడుతున్నాయి. భారీ వర్షం కారణంగా ఇప్పటికే నాలుగు రోజుల ఆటలో రెండు రోజులు తుడిచిపెట్టుకుపోగా.. మంగళవారం వరుణుడు శాంతించడంతో మ్యాచ్ సజావుగా సాగింది.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం కోల్పోయిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులు ముందంజలో నిలిచి మ్యాచ్ ఐదో రోజును ముగించింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్ (8) రోహిత్ (30; 2 ఫోర్లు) అవుట్ కాగా… పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నా రు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా… భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు.
బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ (177 బంతుల్లో 49) పట్టుదలతో నిలువగా.. సౌథీ (30) వేగంగా పరుగులు రాబట్టాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్.. 32 పరుగుల కీలక ఆధిక్యాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 4, ఇషాంత్ శర్మ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్‌ఇండియా మంగళవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 64 పరుగులు చేసింది. చేతిలో 8 వికెట్లు ఉన్న కోహ్లీ సేన..32 పరుగుల ఆధిక్యంలో ఉంది. చతేశ్వర్ పుజారా (12), విరాట్ కోహ్లీ (8) క్రీజులో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఐదు రోజుల ఆట ముగియగా.. నేడు రిజర్వ్‌డేలో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్ కొనసాగించనుంది.