ముంబయి – సొంతగడ్డపై భారత్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కోల్పోయిన ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలనుకుటున్నది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ తన విన్నింగ్ జట్టులో ఎలాంటి మార్పు చేయకుండా బరిలోకి దిగుతున్నది.
అయితే భారత్ మాత్రం స్టార్ పేసర్ బుమ్రాను పక్కన పెట్టింది. అతని స్థానంలో హైదరాబాదీ సిరాజన్ను తీసుకున్నది.
కాగా, బ్యాటింగ్ కు దిగిన కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి వికెట్ కాన్వాయ్ రూపం లో కోల్పోయింది. ఈ వికెట్ ఆకాశ్ కు లభించింది.
తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ, జైస్వాల్, గిల్, కోహ్లి, పంత్, సర్ఫ్రాజ్, జడేజా, సుందర్, అశ్విన్, ఆకాశ్ దీప్, సిరాజ్
న్యూజిలాండ్: లాథమ్, కాన్వే, యంగ్, రవీంద్ర, డారిల్ మిచెల్, బ్లండెల్, ఫిలిప్స్, సోధి, హెన్రీ, పటేల్, విలియయ్