Tuesday, November 19, 2024

India Vs New Zealand – రెండో టెస్ట్ … సిరీస్ గోవిందా…

భార‌త జ‌ట్టు కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. సొంత‌గ‌డ్డ‌పై వ‌రుస‌గా 18వ టెస్టు సిరీస్ విజ‌యంతో జోరుమీదున్న టీమిండియా రికార్డుకు కివీస్ అడ్డుక‌ట్ట వేసింది. ఫుణేలో జ‌రిగిన‌ ఈ టెస్టులో 133 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. మిచెల్ సాంట్న‌ర్(6,/106) సంచ‌ల‌న బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను విజ‌యం వాకిట నిలిపాడు.

కాగా, ఓవ‌ర్‌నైట్ స్కోర్ 198-5తో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌ను జ‌డేజా దెబ్బ కొట్టాడు. డేంజ‌ర‌స్ గ్లెన్ ఫిలిఫ్స్‌()ను ఔట్ చేసి వికెట్ల ప‌త‌నానికి నాంది ప‌లికాడు. 255 ప‌రుగుల‌కు ఆలౌట‌య్యింది. తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల లీడ్‌ సాధించిన కివీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమ్‌ఇండియాకు 359 పరుగులను టార్గెట్‌ ఉంచింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు వచ్చిన భారత్‌ మళ్లీ తడబడింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(77), ఆల్ రౌండర్ జడేజా(42) తప్ప అందరూ నిరాశ పరిచారు. దీంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. భారత బ్యాటర్లలో రోహిత్(8), విరాట్(17), గిల్(23), పంత్(0), సుందర్(21), సర్ఫరాజ్(9), అశ్విన్(18), ఆకాశ్ దీప్(1), బూమ్రా(10) పరుగులు చేశారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement