Friday, November 22, 2024

India vs Netherlands – శ్రేయ‌స్, రాహుల్లా మెరుపు సెంచురీలు – నెద‌ర్లాండ్స్ కు భారీ టార్గెట్

వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌.. మొదట బ్యాటింగ్‌కు దిగి వీరబాదుడు బాదింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 61, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (32 బంతుల్లో 51, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ (56 బంతుల్లో 51, 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలకు తోడు శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌, 10 ఫోర్లు, 5 సిక్సర్లు), కెఎల్‌ రాహుల్‌ (64 బంతుల్లో 102, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) లు సెంచరీలతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌.. 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. నెద‌ర్లాండ్స్ గెల‌వాలంటే 411 ప‌రుగులు చేయాల్సి ఉంది..

కాగా 411 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్ దిగిన నెద‌ర్లాండ్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది.. ఓపెన‌ర్ వెస్లీ నాలుగు ప‌రుగులు చేసిన‌ సిరాజ్ అవుట్ చేశాడు ..ప్ర‌స్తుతం నెద‌ర్లాండ్స్ నాలుగు ఓవ‌ర్లో ఒక వికెట్ న‌ష్టానికి 11 ప‌రుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement