బెంగళూరులో గత రాత్రి భారీ వర్షం పడింది. దీంతో గ్రౌండ్ చిత్తడి గా మారింది . ఈ నేపథ్యం లో నేటి తొలి సెషన్ ఆటకు బ్రేక్ బ్రేక్ పడింది.
కాగా, న్యూజిలాండ్ ముందు కేవలం 107 పరుగుల లక్ష్యం. ఒకే ఒక్క రోజు మిగిలి ఉంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ జట్టుకు విజయం పెద్ద కష్టమేం కాదు. అయితే అందుకు వరుణుడు అడ్డు పడుతున్నాడు..
బెంగళూరులో నేడూ వర్షాలు ..
ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. నేడు వర్షం పడే అవకాశాలు ఎక్కువేనని సమాచారం. శనివారం రాత్రి నుంచే కురుస్తున్న వర్షం మధ్యలో ఆగినప్పటికీ.. ఆదివారం సాయంత్రం వరకూ అడపాదడపా పడుతూనే ఉంటుందని రిపోర్ట్ పేర్కొంది. ఇలాగే కొనసాగితే మాత్రం మ్యాచ్ నిర్వహణ కష్టంగా మారడం ఖాయం. ఇవాళ ఉదయం కూడా ఆకాశం మేఘావృతమై ఉంది.
11 గంటల వరకు వర్షం పడి ఆగినా.. మైదానాన్ని సిద్ధం చేసేందుకు కనీసం గంట పడుతుంది. ఈ లోపు తొలి సెషన్ ఆటను కోల్పోయినట్లే. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకూ చినుకులు పడతాయని ఆక్యూ వెదర్ రిపోర్ట్ చెబుతోంది. అనూహ్యంగా సాయంత్రం 4 గంటల నుంచి వర్షం ఉండదని పేర్కొంది.