వాషింగ్టన్ సుందర్ కు అయిదు వికెట్లు
నాలుగు వికెట్లు తీసిన జడేజా
ముంబయి – ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు అలౌట్ అయింది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో భారత స్పిన్నర్లు చెలరేగుతున్నారు. తొలుత వాషింగ్టన్ సుందుర్ న్యూజిలాండ్‌ను కష్టాల్లోకి నెట్టగా.. రవీంద్ర జడేజా ‘నేనేమీ తక్కువా’ అంటూ విజృంభించాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి జట్టుకు బ్రేకిచ్చాడు. ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ కి నాలుగు, జడేజాకు అయిదు వికెట్లు లభించాయి..
కాగా, తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. దు డెవాన్ కాన్వే(4)ను ఆకాశ్ దీప్ బోల్తాకొట్టించగా.. వాషింగ్టన్ సుందర్ సూపర్ బౌలింగ్‌తో టామ్ లాథమ్(28), రచిన్ రవీంద్ర(5) పెవిలియన్ చేర్చాడు. ఈ సిరీస్‌లో రచిన్ రవీంద్రను వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో లంచ్ సమయానికి 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్‌తో కలిసి విల్ యంగ్ ఆచితూచి ఆడుతున్నాడు.
అయితే ఈ స్థితిలో క్రీజులో పాతుకుపోయిన విల్ యంగ్(71)ను, టామ్ బ్లండెల్(0)ను ఔట్ చేసి న్యూజిలాండ్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 82 పరుగులు చేసిన మిచెల్ ను ఇంటికి పంపాడు..ఇక జడేజా చివరిలో మూడు వికెట్లు పడగొట్టాడు..ఇక పదో వికెట్ వాషింగ్టన్ కు దక్కింది.