Tuesday, November 26, 2024

ఐసీసీకి చేరిన ఐదో టెస్ట్ పంచాయతీ..

టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన నాలుగో ఐదవ టెస్ట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్‌ రద్దు వ్యవహారంపై ICCకి చేరింది. ఈ మ్యాచ్‌ భవితవ్యం సిరీస్‌ ఫలితంపై ఆధారపడడంతో ఐసీసీకి లేఖ రాసింది ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు. ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఐసీసీ డిస్ప్యూట్‌ రిసొల్యూషన్‌ కమిటీ -DRCకి లేఖ రాసింది. కరోనా కేసుల వల్ల ఈ మ్యాచ్‌ రద్దయిందని ప్రకటిస్తే… తమకు 40 మిలియన్‌ పౌండ్ల నష్టం జరుగుతుందంటోంది ECB. ఇలాంటి పరిస్థితుల్లో సరైన పరిష్కారం చూపితే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకునే వీలుంటుందని భావిస్తోంది. ఈ కారణంగానే సాయం చేయాల్సిందిగా ICCని కోరింది ECB.

ఇక రద్దయిన ఐదో టెస్టును భవిష్యత్‌లో తిరిగి నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తోంది బీసీసీఐ. దీని కోసం త్వరలోనే ఇంగ్లాండ్‌కు వెళ్తున్నారు BCCI అధ్యక్షుడు సౌరభ్‌గంగూలీ. ఇక ECB లేఖతో ICC ముందు ఇప్పుడు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒక వేళ ఐదో టెస్టును గనుక ఐసీసీ పూర్తిగా రద్దు చేస్తే టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. అప్పుడు దీన్ని నాలుగు టెస్టుల సిరీస్‌గానే పరిగణిస్తారు. టీమిండియానే ఈ మ్యాచ్‌లో ఆడటానికి విముఖత చూపడం వల్ల ఇంగ్లాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు. చివరి టెస్టులో ఆడటానికి ఆ జట్టు సిద్ధంగా ఉన్నా భారత్‌ ఒప్పుకోని పక్షంలో ఫలితాన్ని ఇంగ్లాండ్‌కే కేటాయిస్తారు. దీంతో 2-2తో సిరీస్‌ సమానంగా మారుతుంది. అప్పుడు ఇంగ్లాండ్‌ బోర్డు ఇన్సూరెన్స్‌ కూడా క్లెయిమ్‌ చేసుకునే వీలుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: కోహ్లీ కెప్టెన్సీ మార్పు: భూటకపు వార్తలన్న బీసీసీఐ అధికారి..

Advertisement

తాజా వార్తలు

Advertisement