Tuesday, November 26, 2024

టీ20 వరల్డ్​ కప్​: గబ్బాలో ఇవ్వాల టీ20.. ఆస్ట్రేలియాతో టీమిండియా వామప్​ మ్యాచ్​

హలో.. ఇండియా vs ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్​ ఇవ్వాల ఆస్ట్రేలియాలోని గబ్బా స్టేడియంలో జరుగుతోంది. గత వారం వెస్ట్ ఆస్ట్రేలియన్ XIతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచిన భారత్, రెండు రోజుల తర్వాత బౌన్సీ వాకా స్టేడియంలో రెండో గేమ్‌లో ఓడిపోయింది. అక్కడి పిచ్ బౌన్స్ బాగా అవుతుందని, అయితే.. గబ్బా స్టేడియం కూడా దానికి భిన్నంగా ఉండదనే చెబుతున్నారు క్రికెట్​ అనలిస్టులు.

ఇక.. గబ్బా స్టేడియంతో టీమిండియాకు ఇంతకుముందు మంచి జ్ఞాపకాలే ఉన్నాయి. ఆస్ట్రేలియాపై మరో హీస్ట్ ను పునరావృతం చేయగలరా? T20 ప్రపంచ కప్ ప్రారంభంలో వారి సత్తాచూపి.. మరింత విశ్వాసంతో మిగతా మ్యాచ్​లలో హీట్​ పెంచగలరా? అన్న అప్‌డేట్స్​ కోసం  వేచి చూడాల్సిందే.

కాగా.. టీమిండియా జట్టులో మొత్తం 15 మంది ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవ్వాల (సోమవారం) మధ్యాహ్నం ఆటను ఆడేందుకు యత్నిస్తారు అని కెప్టెన్​ రోహిత్​ అన్నారు. ఇందులో దినేష్ కార్తీక్ ఆరు, అక్షర్ పటేల్ ఏడు, రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిది, హర్షల్ పటేల్ తొమ్మిది నెంబర్లలో ఆడేందుకు రెడీగా ఉన్నారు. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ 10వ, 11వ స్థానాల్లో ఉన్నారు, దీని వలన దీపక్ హుడా, రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్.. మహ్మద్ షమీ పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్​లో ఆడేందుకు చాన్స్​ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

- Advertisement -

ఇక, మెడనొప్పి ఉన్నందున ఆస్ట్రేలియా జట్టు డేవిడ్ వార్నర్‌ను ముందుగా రంగంలోకి దించనుంది. మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా,  జోష్ హాజిల్‌వుడ్ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ లోపాల వల్ల భారత్‌కు పెద్ద ప్లస్‌ అవుతుంది.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ఆరోన్ ఫించ్(సి), గ్లెన్ మాక్స్ వెల్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్(w), టిమ్ డేవిడ్, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement