ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బోణీ కొట్టింది. విశ్వ క్రీడల తర్వాత ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టిన భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే గర్జించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ 3-0తో చైనాను చిత్తుగా ఓడించింది.
ఆదివారం చైనాతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ఆఖర్లో చైనా ఆటగాళ్లు గోల్ కొట్టేందుకు ఎంతో ప్రయత్నించారు. పెనాల్టీ కార్నర్‌లతో పరువ కాపాడుకోవాలని చూశారు. కానీ, భారత డిఫెన్స్ వాళ్ల ఎత్తులను చిత్తు చేసింది.
ఇక పీఆర్ శ్రీజేశ్ రిటైర్ అవ్వడంతో.. భారత గోల్ కీపర్‌గా ఎంపికైన సూరజ్ కర్కేరా తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. చైనా గోల్ ప్రయత్నాలను సమర్ధంగా అడ్డుకొని శెభాష్ అనిపించుకన్నాడు. కాగా, టోర్నీలోని తర్వాతి మ్యాచ్‌లో భారత జట్టు సెప్టెంబర్ 9న జపాన్‌తో తలపడనుంది.