Saturday, June 29, 2024

IND vs SA | దక్షిణాఫ్రికా టూర్‌కు భారత్‌..

భారత పురుషుల క్రికెట్‌ జట్టు నవంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు సంబభించిన షెడ్యూల్‌ను భారత్‌ క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ), దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ)లు శుక్రవారం సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా సఫారీ గడ్డపై నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది.

ఇరుజట్ల మధ్య నవంబర్‌ 8 నుంచి 15 వరకు ఈ పొట్టి సిరీస్‌ జరుగనుంది. డర్బన్‌ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో భారత్‌ పర్యటన మొదలవుతోంది. ఇక గతేడాది దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లిన భారత్‌.. అక్కడ టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ ఆడింది. వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న టీమిండియా.. టెస్టు, టీ20 సిరీస్‌ను డ్రా చేసుకుంది.

సిరీస్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • నవంబర్‌ 8న తొలి టీ20, వేదిక: డర్బన్‌
  • నవంబర్‌ 10న రెండో టీ20, వేదిక: గబేహా
  • నవంబర్‌ 13న మూడో టీ20, వేదిక: సెంచూరియన్‌
  • నవంబర్‌ 15న నాలుగో టీ20, వేదిక: జొహన్నెస్‌ బర్గ్‌.
Advertisement

తాజా వార్తలు

Advertisement