భారత స్టార్ షట్లర్, ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్‌కు ఇండియా ఓపెన్‌లో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. జనవరి 11నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో డబుల్ ఒలింపిక్ పతక విజేత, మాజీ ప్రపంచ నంబర్‌వన్ పీవీ సింధు కూడా మహిళల సింగిల్స్‌లో పోటీపడనుంది. అదేవిధంగా సైనా నెహ్వాల్, మాల్విక, అస్మిత కూడా పోటీపడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌తోపాటు ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, పారిపల్లి కశ్యప్, సమీర్‌వర్మ తదితరులు టైటిల్ కోసం తలపడనున్నారు.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి, పుల్లెల గాయత్రి త్రెసా జోలీ పోటీపడనున్నారు. కాగా ఈ టోర్నీలో పురుషుల ప్రపంచ బ్యాడ్యింటన్ ఛాంపియన్ లో కీన్ కూడా బరిలోకి దిగనుండటం విశేషం. దేశ రాజధాని ఢిల్లిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కేడీ జాదవ్ ఇండోర్ హాల్‌లో టోర్నీ జరగనుంది. కరోనా వేరియంట్ నేపథ్యంలో అభిమానులును అనుమతించడం లేదు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ సూపర్-500 టోర్నీల్లో భాగంగా ఇండియా ఓపెన్ నిర్వహించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital