Saturday, November 23, 2024

భారత్ – న్యూజిలాండ్ మహిళల టీ20.. 18 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపు

న్యూజిలాండ్‌ : క్విన్స్‌ టౌన్‌ వేదికగా న్యూజిలాండ్‌ మహిళా జట్టుతో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్‌ మహిళల జట్టు ఓటమి చవిచూసింది. భారత్‌ జట్టుపై 18 పరుగుల తేడాతో కివీస్‌ ఉమెన్స్‌ టీం ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు బేట్స్‌, డివైన్‌లు తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యం అందించారు. 60 పరుగుల వద్ద డివైన్‌ (31) పెవిలియన్‌ చేరుకుంది. కొన్ని ఓవర్స్‌ తరువాత బేట్స్‌ (36)ను గాయక్వాడ్‌ ఔట్‌ చేయడంతో కివిస్‌ రెండు వికెట్లు కోల్పోయింది. అమెలియా (17), మ్యాడీ (26), తాహుహు (27)లు రాణించారు. హాలిడే (నాటౌట్‌) 7, కేటీ (నాటౌట్‌) 9గా నిలిచారు. దీంతో 20 ఓవర్స్‌లో 155 పరుగులు చేసింది. భారత్‌ బౌలర్స్‌లో పూజా, దీప్తి శర్మకు రెండేసి వికెట్లు దక్కాయి.

గాయక్వాడ్‌కు ఒక వికెట్‌ దొరికింది. 156 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా భారత్‌ ఇన్నింగ్స్‌ను భాటియా, షెఫాలీలు ప్రారంభించారు. తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మిడిల్‌ ఆర్డర్‌ చేతులెత్తేయడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మేఘన (37), భాటియా (26), షెఫాలీ వర్మ (13), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (12), వస్త్రకర్‌ (10), బహదుర్‌ (10) రాణించారు. 20 ఓవర్లు ఆడిన కౌర్‌ సేన 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేసింది. చివరి కివీస్‌ సేన భారత్‌పై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ బౌలర్స్‌లో జెస్‌, అమేలియా, జాన్సెన్‌లు రెండేసి వికెట్లు తీశారు. లీయాకు ఒక వికెట్‌ దక్కింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement