ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భారత్‌కు రెండో మ్యాచ్‌లో పరాజయం ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీసేన ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ 62పరుగులు తేడాతో విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 71పరుగులుతో పోరాడినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయింది. 75పరుగులుతో సత్తాచాటిన కివీస్ బ్యాటర్ అమీ సాటర్త్‌వైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. తొలుత ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారతజట్టు బౌలింగ్ ఎంచుకుని న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సుజీబేట్స్, డివైన్ జోడీ కివీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. బేట్స్ (5)పరుగులుకే రనౌటై వెనుదిరిగినా కెప్టెన్ డివైన్ 30బంతుల్లో 7ఫోర్లుతో 35పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది. ఫామ్‌లో కెర్ 64బంతుల్లో 5ఫోర్లుతో 50పరుగులుతో హాఫ్‌సెంచరీ చేసి గైక్వాడ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. వికెట్‌కీపర్ కేటీ మార్టిన్ 41పరుగులు, మ్యాడీ గ్రీన్ 27పరుగులు చేశారు.
మొత్తంమీద న్యూజిలాండ్ నిర్ణీత 50ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4వికెట్లు, గైక్వాడ్ 2వికెట్లు, దీప్తీశర్మ, గోస్వామీ తలో వికెట్ తీశారు. అనంతరం 261పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన మిథాలీసేన 46.4ఓవర్లలో 198 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ యాస్తికా బాటియా 59బంతుల్లో 2ఫోర్లుతో 28పరుగులు చేసి ఔటైంది. స్మృతి మందాన 6పరుగులు చేసి జెస్‌కేర్ బౌలింగ్‌లో బేట్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన దీప్తీశర్మ 5పరుగులు మాత్రమే చేసి ఎల్బీగా వెనుదిరిగింది. అయితే కెప్టెన్ మిథాలీరాజ్ 56బంతుల్లో ఓ ఫోరుతో 31పరుగులు చేసి అమిలయా కేర్ బౌలింగ్‌లో మార్టిన్ చేతికి దొరికిపోయింది. వరుసగా భారత బ్యాటర్లు వెనుదిరిగినా హర్మన్‌ప్రీత్ కౌర్ 63బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లుతో 71పరుగులు చేసి డివైన్‌కు క్యాచ్‌ఇవ్వడంతో మిథాలీసేన పోరాటం ముగిసింది. వికెట్‌కీపర్ రీచా ఘోష్ డకౌట్ అవడంతో భారత్ 97పరుగులుకే 5వికెట్లు కోల్పోయింది. స్నేహ్‌రానా 28బంతుల్లో 2ఫోర్లుతో 18పరుగులు చేసి ఔటవడంతో 127పరుగులుకే భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. మొత్తంమీద 46.4ఓవర్లలో భారత జట్టు 198పరుగులు చేసి కుప్పకూలింది.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్
బేట్స్ (రనౌట్) 5, డివైన్ (సి) రీచాఘోష్ 9బి) పూజా వస్త్రాకర్ 35, అమిలియాకేర్ (ఎల్బీ) గైక్వాడ్ 50, సాటర్త్‌వైట్ (సి) మిథాలీ (బి) పూజా వస్త్రాకర్ 75, గ్రీన్ (సి) స్మృతి మంధాన (బి) దీప్తీ 27, కేటీ మార్టిన్ (బి) గోస్వామి 41, జెన్సన్ (బి) గైక్వాడ్ 1, తహుహు (బి) పూజావస్త్రాకర్ 1, జెస్‌కేర్ (బి) పూజావస్త్రాకర్ 0, మెకాయ్ (నాటౌట్) 13, హన్నారోయి (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 10. మొత్తం: 260 (9వికెట్లు. 50ఓవర్లు). వికెట్లపతనం: 9-1, 54-2, 121-3, 175-4, 224-5, 233-6, 240-7, 240-8, 255-9. బౌలింగ్: గోస్వామి 9-1-41-1, మేఘనాసింగ్ 8-0-49-0, గైక్వాడ్ 10-0-46-2, పూజా వస్త్రాకర్ 10-0-34-4, దీప్తీశర్మ 8-0-52-1, స్నేహ్‌రానా 5-0-32-0.
భారత్ ఇన్నింగ్స్
యస్తికా బాటియా (సి) మెకాయ్ (బి) తహుహు 28, స్మృతి మంధాన (సి) బేట్స్ (బి) జెస్‌కేర్ 6, దీప్తీశర్మ (ఎల్బీ) తహుహు 5, మిథాలీరాజ్ (స్టంపౌట్) కేటీమార్టిన్ (బి) అమీలియా కేర్ 31, హర్మన్‌ప్రీత్‌కౌర్ (సి) డివైన్ (బి) అమిలీయా కేర్ 71, రీచాఘోష్ (బి) అమిలీయాకేర్ 0, స్నేహ్‌రానా (సి) కేటీ మార్టిన్ (బి) తహుహు 18, పూజావస్త్రాకర్ (సి) డివైన్ (బి) హన్నత్ 6, జులన్ గోస్వామి (బి) జెన్సన్ 15, మేఘనాసింగ్ (నాటౌట్) 12, రాజేశ్వర్ గైక్వాడ్ (సి) కేటీ మార్టిన్ (బి) జెన్సెన్ 0. మొత్తం: 198 (10 వికెట్లు. 46.4ఓవర్లు). వికెట్లపతనం: 10-1, 26-2, 50-3, 97-4, 97-5, 127-6, 143-7, 178-8, 198-9, 198-10. బౌలింగ్: మెకాయ్ 8-1-25-0, జెస్‌కేర్ 7-1-40-1, హన్నత్ 6-1-28-1, తహుహు 10-2-17-3, హేలీజెన్సన్ 6.4-0-30-2, అమీలియా కేర్ 9-0-56-3.