Friday, November 22, 2024

ఇండియా లెజెండ్స్‌ ఛాంపియన్స్

రోడ్‌ సెఫ్టీ వల్డ్ సిరీస్‌ లో భారత్‌ లెజెండ్స్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది.  ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుచేసి టైటిల్‌ కైవసం చేసుకున్నారు. ఇండియన్‌ లెజెండ్స్‌ జట్టు 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా.. యూసుఫ్‌ పఠాన్‌ 36 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్ లతో 62 పరుగులతో నాటౌట్‌ గా నిలచాడు. యువరాజ్‌ సింగ్‌ 41 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 60 పరుగులతో దుమ్మురేపడంతో 20 ఓవర్లలో 181 స్కోరు చేసింది. సచిన్‌ 23 బంతుల్లో 5 ఫోర్లతో 30 కూడా సత్తా చాటాడు. యువరాజ్‌ సింగ్‌- యూసఫ్‌ పఠాన్‌లు దూకుడుగా బ్యాటింగ్‌ చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో లంక లెజెండ్స్‌ టీమ్‌ తడబడింది. చివర్లో వీరవర్దెనె, జయ సింఘె దూకుడుగా ఆడినా ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో యూసఫ్‌, ఇర్ఫాన్‌ చెరో రెండు, మునాఫ్‌, గోనీ తలా ఓ వికెట్‌ తీసుకున్నారు. దిల్షాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు దక్కింది. చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘేల్‌ చేతుల మీదుగా సచిన్‌ లెజెండ్స్‌ కప్‌ను అందుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement