Sunday, November 24, 2024

Lima Junior Worlds | 24 పతకాలతో భారత్‌ అగ్రస్థానం…

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ రైఫిల్‌/పిస్టల్‌/ షాట్‌గన్‌లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా 24 పతకాలు గెలిచింది. ఇందులో 13 స్వర్ణాలు, మూడు రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. 5 స్వర్ణాలు, 4రజతాలు, ఒక కాంస్యంతో ఇటలీ రెండవ స్థానంలో నిలవగా, నాలుగు స్వర్ణాలు సహా 10 పతకాలతో నార్వే మూడవ స్థానం దక్కించుకుంది.

పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో జూనియర్‌ షూటర్లు స్వర్ణం సాధించారు. దీపక్‌లాల్‌ (545), కమల్‌జీత్‌ (543), రాజ్‌చంద్ర 9528)లతో కూడిన పురుషుల పిస్టల్‌ బృందం 1616 పాయింట్లు సాధించింది. ఒక పాయింట్‌ తేడాతో అజర్‌బైజాన్‌ రెండవ స్థానంలోను, ఆర్మేనియా మూడవ స్థానంలోనూ నిలిచాయి.

ముఖేష్‌ నెలవల్లి వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో అతనికిది ఆరవ పతకం. 60 షాట్లలో 548 పాయింట్లు సాధించాడు. జూనియర్‌ మహిళల 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో పరిషా గుప్తా 540 స్కోరుతో వ్యక్తిగత రజతం గెలుచుకుంది. అలాగే, సెజల్‌ కాంబ్లే (529), కేతన్‌ (525), కనిష్క (513)తో కూడిన భారత బృందం రజతంతో సరిపెట్టుకుంది. ఈవెంట్‌ చివరిరోజున శార్దూల్‌ విహాన్‌, సబీరా హారిస్‌ జోడీ మిక్స్‌డ్‌ టీమ్‌ ట్రాప్‌పోటీలో భారత్‌కు కాంస్యాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement