కామన్‌వెల్త్ క్రీడల్లో ఆదివారం టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు ఆధిపత్యం ప్రదర్శించారు. బంగ్లాదేశ్‌పై 3-0తో తిరుగులేని విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లారు. ఆ పోటీలో నైజీరియాతో తలపడనున్నారు. భారత ఆటగాళ్లు శరత్ కమల్, జ్ఞానశేఖరన్ తమతమ సింగిల్స్ కేటగిరీ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనతో విజయం సాధించగా డబుల్స్ విభాగంలో పురుషుల తొలి గేమ్‌లో సాథియాన్ జ్ఞానశేఖరన్ జోడీ రామ్‌హివ్లిుయాన్ బాన్, మొహుతాసిన్ అహ్మద్ రిడాయ్ జంటపై విజయం సాధించారు. ఇక జ్ఞానశేఖరన్, దేశాయ్ జోడీ బంగ్లాదేశ్‌పై 4-3 తేడాతో ఆధిక్యం సాధించారు. సింగిల్స్‌లో కమల్ మహమ్మద్ రిఫ్పత్ షబ్బీర్‌పై విజయం సాధించాడు.
కాగా బాక్సింగ్ విభాగంలో నిఖత్ జరీన్ మొజాంబిక్‌కు చెందిన హెలెనా ఇస్మాయిల్‌పై 5-0తో విజయం సాధించి 50 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. కాగా పతకాలు సాధిస్తాడని ఆశలు పెట్టుకున్న శివథాపా 63.5 కేజీల కేటగిరీలో స్కాట్లాండ్‌కు చెందిన రీస్ లించ్ చేతిలో పరాజయం పాలైనాడు. కాగా స్విమ్మింగ్ పురుషుల విభాగంలో 50 మీటర్ల కేటగిరీలో లక్ష్యాన్ని కేవలం 25.52 సెకన్లలో పూర్తి చేసి సెమీస్‌కు దూసుకెళ్లాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.