రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీమిండియా సరికొత్త ప్రస్థానం ఇవ్వాల మొదలైంది. న్యూజీలాండ్‌తో జరిగిన ఫస్ట్ టి20లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 164 పరుగులు చేసింది. టీమ్ ఇండియా ముందు భారీ టార్గెట్‌నే పెట్టింది. 165 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మన్ మొదటి నుంచి దూకుడుగానే ఆడారు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించి మొదటి 5 ఓవర్లలో 50 పరుగులు చేశారు.
ఆ తర్వాత ఆరో ఓవర్‌లో రాహుల్ అవుటయ్యాడు. 56/1 ఇండియా స్కోర్ ఉంది. ఆ తర్వాత రోహిత్ కు జోడీగా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 13 ఓవర్ల వరకు బాగానే ఆడిన వీళ్లిద్దరు 14వ ఓవర్‌లో రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ సూర్యకుమార్ దూకుడు పెంచారు. 18వ ఓవర్లో సూర్యకుమార్ క్లీన్ బౌల్డ్ కావడంతో శ్రేయస్ అయ్యర్ బరిలో దిగాడు. అప్పటికి స్కోరు 149/3 గా ఉంది. 19వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అవుట్ కావడంతో (155/4) పెవిలియన్ చేరాడు. అప్పటికి ఇంకా 7 బాల్స్ ఉండగా 10 పరుగులు చేయాల్సి ఉంది. పంత్ కు జోడీగా కొత్తగా అరంగేట్రం చేసిన వెంకటేశ్ అయ్యర్ బరిలోకి వచ్చాడు. చవర్లో కాస్త ప్రెషర్ పెరిగింది. 160 పరుగుల వద్ద వెంకటేశ్ అయ్యర్ బ్యాక్ పుల్ చేసి క్యాచ్ ఇచ్చి నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. అప్పటికి ఇంకా నాలుగు బందులు మిగిలి ఉండగా.. 5 పరుగులు చేయాల్సి ఉంది. యావత్ భారతదేశం, క్రికెట్ లవర్స్ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా పంత్‌కు జోడీగా వచ్చిన అక్సర్ సింగిల్ తీసి బ్యాటింగ్ పంత్కి అందించాడు, మరో రెండు బంతులు మిగిలి ఉండగానే పంత్ ఫోర్ కొట్టి ఇండియాకి అద్భుతమైన విజయాన్ని అందించాడు.