స్వంత గడ్డపై సఫారీలతో జరగబోయే మూడో టీ-20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే మార్పులు చేసిన భారత్ మరిన్ని మార్పులు చేయనున్నట్లు జట్టు యాజమాన్యం చెబుతోంది. ఇండోర్ వేదికగా జరగనున్న మూడో టీ-20 మరికొన్ని గంటలు మాత్రమే ఉన్న నేపథ్యంలో గెలిచి తీరడానికి భారత్ చేస్తున్న కసరత్తు క్లీన్ స్వీప్ చేసే దిశగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ మ్యాచ్ కోసం కొందరు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. సౌతాఫ్రికాపై వరుసగా రెండు టీ 20 మ్యాచుల్లో గెలిచి భారత్ 2-0 తేడాతో ఇప్పటికే సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. ఇండోర్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇవ్వాల మూడో టీ-20 మ్యాచ్ జరుగనుంది. టీ-20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టు ఆడుతున్న చివరి టీ-20 మ్యాచ్ ఇదే కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు గెలిచి పరువు నిలబెట్టుకోవాలని సౌతాఫ్రికా ఆటగాళ్లు చూస్తుండగా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేసుకోవాలని భారత్ ఉవ్విళూరుతుంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు మ్యాచ్ కోసం సిద్దమవుతున్న తరుణంలో స్వల్ప మార్పులు చేసింది. కోహ్లీ, రాహుల్‌లకు రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. సరిగ్గా సంవత్సరం క్రితం జరిగిన టీ-20 ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరకుండానే వెనుదిరిగిన భారత్ ఈసారి మాత్రం టైటిల్ మీద కన్నేసింది.
భారత్‌కు కలిసొచ్చిన అంశాల్లో టాప్-4 బ్యాట్స్‌మెన్స్. వీళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. సఫారీలతో జరిగిన రెండో టీ-20లో కెఎల్ రాహుల్ కూడా స్ట్రయిక్ రేటు మెరుగుపర్చుకుని గాడిలో పడ్డాడు. ఆసియాకప్ నుంచి అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి సఫారీలతో జరిగిన టీ-20 అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ జట్టు గెలుపునకు కృషి చేస్తున్నాడు. ఒక శతకం, మూడు అర్ధ శతకాలతో సత్తా చాటాడు. కోహ్లీ స్ట్రయిక్ రేటు 140కి పైనే ఉంది. ఇకపోతే రోహిత్ శర్మ కూడా తక్కువేం కాదు. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రన్‌మెషీన్‌లా దూసుకెళ్తున్న సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు.
టీ-20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఈ నెల 22వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత్ ఢీ కొట్టనుంది. మూడో టీ-20 ప్రపంచకప్ నేపథ్యంలో మూడో టీ-20కి విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రెండో టీ020లో వికాటం కోహ్లీ పరుగుల వరద పారించాడు. 28 బంతుల్లో కోహ్లీ 49 పరుగులు పూర్తి చేసుకుని నాటౌట్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో రిషబ్ పంత్‌కు ఇప్పటి వరకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా రెండో టీ-20లో దినేష్ కార్తిక్ కేవలం 7 బంతులనే ఎదుర్కొన్నాడు. ఫినిషర్‌గా తన సత్తా చాటుతున్నాడు.
గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడంతో టీమిండియాకు బౌలింగ్ కష్టాలు మొదలయ్యాయి. భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. స్పిన్నర్ అశ్విన్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. బుమ్రా స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న మహమ్మద్ సిరాజ్ మూడో టీ-20లో బరిలో దిగే అవకాశం ఉంది.ఏ మాట కా మాట చెప్పుకోవాలి. రెండో టీ-20లో సిరీస్ కోల్పోయినా దక్షిణాఫ్రికా జట్టు రెండో టీ-20లో బ్యాటింగ్‌లో ఔరా అనిపించింది. సెంచరీతో డేవిడ్ మిల్లర్ సత్తా చాటాడు. డికాక్ కూడా రాణించాడు. కెప్టెన్ తెంబా బవుమా పేలవ ఫామ్ సఫారీ జట్టును ఆందోళనకు గురిచేస్తుంది.
దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్
3టి20 మ్యాచ్
వేదిక: ఇండోర్
సమయం: రాత్రి 7 గంటల నుంచి