Tuesday, September 17, 2024

Duleep Trophy | రుతురాజ్ టీమ్ బోణీ.. శ్రేయస్ సేనపై ఘన విజయం

దులీప్ ట్రోఫీలో భాగంగా అనంతపురం వేదికగా జ‌రిగిన మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని ఇండియా-డితో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఇండియా-సి జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆరు పాయింట్లతో పట్టికలో సీ-టీమ్ అగ్రస్థానంలో నిలిచింది.

ఓవర్‌నైట్ స్కోరు 206/8తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఇండియా-డీ 236 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (56; 70 బంతుల్లో, 8 ఫోర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (54; 44 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకాలు సాధించారు. మానవ్ సుతార్ ఏడు వికెట్లతో విజృంభించాడు.

- Advertisement -

అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీ-జట్టు 61 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్యన్ జుయాల్ (47; 74 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (46; 48 బంతుల్లో, 8 ఫోర్లు), రజత్ పటిదార్ (44; 77 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అభిషేక్ పోరెల్ (35 నాటౌట్; 63 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), మానవ్ సుతార్ (19; 43 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) జట్టును విజయతీరాలకు చేర్చారు. సరన్ష్ నాలుగు వికెట్లు తీశాడు.

కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-డీ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ (86; 118 బంతుల్లో, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్. విజయ్‌కుమార్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఇండియా-సీ మొదటి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకు ఆలౌటైంది. ఇంద్రజిత్ (72; 149 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకం సాధించాడు. హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement