ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రెండో రౌండ్‌లో భారత్ సి జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. తొలిరోజు దూకుడుగా ఆడిన ఇండియా సి.. రెండో రోజు కూడా అదే జోరు ప్రదర్శించింది. 357/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా సి స్కోరుబోర్డుపై పరుగుల వరద కురిపించింది. దీంతో ఇండియా బి ముందు 526 పరుగల భారీ టార్గెట్ సెట్ చేసింది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (58), సాయి సుదర్శన్ (43), రజత్ పటీదార్ (40), ఇషాన్ కిషన్ (111), బాబా ఇంద్రజిత్ (78), మానవ్ సుతార్ (82) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్ నాలుగు వికెట్ పడగొట్టగా… నవదీప్ సైనీ, నితీష్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు.
అయితే భారీ లక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగిన భారత్ -బి జట్టు నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (51), నారాయణ్ జగదీశన్ (67) తలో హాఫ్ సెంచరీలు అందుకుని ధీటుగా సమాదానం ఇస్తున్నారు. కాగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ బి జట్టు 36 ఓవర్లలో 124 పరుగులు చేసింది. అయితే ఇండియా సి పై 401 పరుగుల వెనుకంజలో ఉంది.