మూడో రోజు 219 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌ను ఆదివారం ఆటను ప్రారంభించిన ఇండియా 307 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగిసింది. తొలి సెషన్‌లోనే ఆలౌటయ్యింది. యంగ్‌స్టర్ ధ్రువ్ జురెల్ (90 : 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అసమాన పోరాటం చేశాడు. కొద్దిలో తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
టామ్ హర్ట్లే బౌలింగ్‌లో బంతిని అంచనా వేయలేక బౌల్డ్ అయ్యాడు. దాంతో, 307 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ సోయబ్ బషీర్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆకాశ్ దీప్‌ను ఎల్బీగా ఔ ట్ చేసిన అతడు ఐదో వికెట్ సాధించాడు.