దులీప్ ట్రోఫీలో ఇండియా–ఏ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఇండియా సి జట్టుపై అద్భుత విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. ఆల్ రౌండ్ షోతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసిన మయాంక్ సేన సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. నాలుగో రోజు ఇండియాస–సితో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు 132 పరుగుల తేడాతో విజయం సాధించి…. రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. దీంతో ఇండియా ఏ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఇదిలా ఉండగా అనంతపురం వేదికగా ఇండియా-ఎ, ఇండియా-సి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా -ఎ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసి… రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. దీంతో 350 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 217 పరుగులకు ఆలౌటైంది.