టీ20 ప్రపంచ కప్ విజేతలతో టీ20 సిరీస్‌కు జింబాబ్వే సిద్దమైంది. భారత జట్టు జింబాబ్వేతో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. అన్ని మ్యాచులు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరగనున్నాయి. కాగా, ఇప్పటికే ఈ సిరీస్‌కు భారత జట్టు ఖరారు కాగా…. తాజాగా జింబాబ్వే క్రికెట్ బోర్డు 17 మందితో కూడిని తమ జట్టును ప్రకటించింది. భారత్‌తో సిరీస్‌కు యువ ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఇక సికందర్ రజా నేతృత్వంలోని జింబాబ్వే జట్టు భారత్‌తో తలపడనుంది.
జింబాబ్వే జట్టు :
రజా సికందర్ (కెప్టెన్), అక్రమ్ ఫరాజ్, బెన్నెట్ బ్రియాన్, క్యాంప్‌బెల్ జోనాథన్, చతారా టెండై, జోంగ్వే లూక్, కైయా ఇన్నోసెంట్, మదాండే క్లైవ్, మాధవెరె వెస్లీ, మారుమణి తడివానాషే, మసకద్జా వెల్లింగ్టన్, మవుతా బ్రాండన్, ముజరబానీ బ్లెస్సింగ్, నకర్విట్ బ్లెస్సింగ్, నాకర్విట్, నాకర్విట్ , లయన్ మిల్టన్.
భారత జట్టు :
శుభమాన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (WK), ధ్రువ్ జురెల్ (వికెట్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే.