Sunday, November 17, 2024

టీమిండియాలో.. కరోనా కలకలం.. ఐసోలేషన్‌లోకి ఆటగాళ్లు..

నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా.. ఫిబ్రవరి 6 నుంచి విండీస్‌తో వన్డే సిరీస్‌ ఆరంభం అవుతుంది. కరేబియన్‌ జట్టు కూడా అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది. ఇంతలోనే టీమిండియా జట్టుపై కరోనా పంజా విసిరింది. కీలకమైన ముగ్గురు ఆటగాళ్లతో పాటు సిబ్బంది మహమ్మారి బారినపడ్డారు. మంగళవారం నుంచే బయో బబుల్‌లోకి వెళ్లిన ఆటగాళ్లకు ఇది షాక్‌ గురి చేస్తున్నది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌తో పాటు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌లకు పాజిటివ్‌ వచ్చింది. కొంత మంది సిబ్బంది కూడా కరోనా బారినపడినట్టు తెలుస్తున్నది. నేటి నుంచి ప్రాక్టీస్‌ సెషన్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా పాజిటివ్‌ కారణంగా వారంతా క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఫిబ్రవరి 6న టీమిండియా 1000వ వన్డే ఆడనుంది. ఈ నేపథ్యంలో కరోనా కలకలం సృష్టించింది. దీంతో మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొంది. కీలక ఆటగాళ్లు దూరం కానుడటంతో.. మ్యాచ్‌ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లందరూ ఐసోలేషన్‌లో ఉన్నారు. సోమవారమే.. టీమిండియా ఆటగాళ్లందరూ.. అహ్మదాబాద్‌ చేరుకున్నారు. వైద్యులు, బీసీసీఐ మెడికల్‌ టీం.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది. అయితే వీరి స్థానంలో ఎవరిని ఆడించాలి అనే దానిపై నేడో.. రేపో.. బీసీసీఐ ప్రకటన చేయనుంది. బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికి పాజిటివ్‌ వచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారంతా ఐసోలేషన్‌కు వెళ్లిపోయారన్నారు. కరోనా నేపథ్యంలో క్లోజ్‌ డోర్‌ గేమ్‌ జరుగుతుందని ఇప్పటికే గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement