Tuesday, July 2, 2024

IND vs SA | స‌ఫారీల‌ను బెంబేలెత్తించిన స్నేహ్ రానా… దంచేసిన సునే, లారా

సొంత‌గ‌డ్డ‌పై వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న ఏకైక‌ టెస్టులో టీమిండియా స్పిన్న‌ర్ స్నేహ్ రానా (8/77) విజృంభ‌ణ‌తో స‌ఫారీ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 266 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. అనంత‌రం ఫాలో అన్ (Follow On) ఆడిన స‌ఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో ప‌ట్టుద‌ల క‌న‌బ‌రిచారు. సునే ల‌స్ (109) సెంచ‌రీతో క‌దం తొక్క‌గా.. లారా వొల్వార్డ్త్ (93 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. దాంతో, మూడో రోజు ఆట ముగిసే స‌రికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల న‌ష్టానికి 232 ర‌న్స్ కొట్టింది. ఇంకా 105 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement