Tuesday, November 26, 2024

Ind vs SA | సౌతాఫ్రికా టూర్‌‌కు షమీ డౌటే !

దక్షిణాఫ్రికాలో పర్యటనలో ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఈ నెల 10న మొదలై ఈ పర్యటనలో భాగంగా.. ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతొంది.., ఆ తర్వాత వన్డే సిరీస్, డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్ జరగనున్నాయి. అయితే, దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆడేది అనుమానంగా మారింది. షమీ కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు.

షమీ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ కీలక విషయాన్ని వెల్లడించాడు. మోకాలి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తే దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను.. చాలా కాలంగా ఈ నొప్పి వేధిస్తోంది.. ఇప్పటికే ఎన్నోసార్లు చికిత్స చేయించుకున్నాను.. కానీ, పూర్తిగా కోలుకోలేకపోతున్నాను అంటూ షమీ పేర్కొన్నారు. ఒకవేళ ఈ మోకాలి నొప్పి గనుక తగ్గితే నేను టెస్టు సిరీస్‌ ఆడటానికి కచ్చితంగా వెళ్తా.. లేదంటే అంతే ఇక అని షమీ పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement