భారత్-దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా నేడు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (117) సెంచరీతో చెలరేగింది. 53 పరుగులకే మూడు వికెట్లు పడిపోయిన దశలో మంధాన ఒంటరి పోరాటం చేసింది. చివర్లో ఆల్ రౌండర్లు దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31 నాటౌట్) రాణించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.
- Advertisement -