టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈ రోజు భారత్, పాకిస్థాన్ జట్లు ఒకదానినొకటి ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు ప్లేయర్స్‌ని ఆయుధాలు సిద్ధం చేసినట్టు చేశాయి. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఈ రెండు దేశాల క్రికెట్ ప్రియులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్‌కి కన్నుల పండుగ లాంటిదే.
క్రికెట్ చరిత్రలోనే ఏ మ్యాచ్‌కు లేనంత ప్రత్యేకత, ప్రాధాన్యం భారత్, పాకిస్థాన్ తలపడే మ్యాచ్‌కు ఉంటుంది. ఒక ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌పై ఎంత ఉత్కంఠ, ఆసక్తి ఉంటుందో.. అంతకంటే రెట్టింపు స్థాయిలోనే భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై జరిగే మ్యాచ్‌లో భారత్‌కి కీలకం కానున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
KL Rahul: విరాట్ కోహ్లీ సేనలో కీలకమైన ఆటగాళ్లలో ఓపెనర్ కె.ఎల్. రాహుల్ . ఐపిఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్ తరపున 13 మ్యాచ్ లలో 626 పరుగులు చేసిన రాహుల్ టీ20 ఫార్మాట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు.
Varun Chakravarthy: ఐపిఎల్ 2021 టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వరుణ్ చక్రవర్తి లీడింగ్ వికెట్ టేకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 17 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టిన వరుణ్ పాకిస్థాన్‌పై తన ప్రతాపాన్ని చూపించాడంటే.. పాక్ బ్యాట్స్‌మెన్ తోకముడవాల్సిందే.
Ravindra Jadeja: ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐపిఎల్ 2021 లో బ్యాట్‌తోనూ, బంతితోనూ రాణించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అది కూడా ఎం.ఎస్ ధోనీ నేతృత్వంలో ఐపిఎల్ 2021 చాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. 145 స్ట్రైకింగ్ రేటుతో కొనసాగుతున్న జడేజా.. ఈ సీజన్‌లో 13 వికెట్లు తీశాడు.
Rohit Sharma: రోహిత్ శర్మ విషయానికొస్తే.. రోహిత్ ఘనతను చూడ్డానికి కేవలం ఐపిఎల్‌ని ఉదాహరణగా తీసుకోనక్కర్లేదు. ఎందుకంటే.. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనే 4 సెంచరీలు చేసి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ.
Jasprit Bumrah : టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టీమిండియాకు ఉన్న పవర్‌ఫుల్ బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా కూడా ఒకరు. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో బుమ్రా 59 వికెట్లు పడగొట్టాడు. 20.25 ఎక్స్‌లెంట్ బౌలింగ్ యావరేజ్‌తో, 6.66 ఎకానమీ రేటుతో బుమ్రా టీమిండియా నమ్ముకున్న బౌలర్లలో ముందుంటాడు. బూమ్ బూమ్ సృష్టిస్తాడు.
ఇది కూడా చదవండి: IND vs PAK: మ్యాచ్‌కు ఫుల్ క్రేజ్.. క్యాష్ చేసుకుంటున్న బ్రాడ్‌కాస్టర్.. యాడ్ రేటెంతో తెలుసా!