అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ల దాయాదుల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ ఓపెనర్లు ఇమామ్ ఉల్ హాక్, అబ్దుల్ షఫీక్ లు నెమ్మదిగా ఆడి మొదటి వికెట్ కు 41 పరుగులు జోడించారు. మొదటి వికెట్ అబ్దుల్ షఫీక్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బాబర్ ఆజంతో కలిసి ఇమామ్ మరో 32 పరుగులు జోడించి అవుట్ అయ్యాడు. అప్పుడు జట్టు స్కోర్ 73 పరుగులు ఉండగా 2 వికెట్లు మాత్రమే పడ్డాయి.. ఆ తర్వాత బాబర్ ఆజమ్, రిజ్వాన్ లు మరో వికెట్ ఇవ్వకుండా 82 పరుగులు జోడించారు.. కానీ మహమ్మద్ సిరాజ్ ఎంట్రీ ఇచ్చి బాబర్ ఆజమ్ (50) ను క్లీన్ బౌల్డ్ చేసి ఇండియా కు మంచి వికెట్ ఇచ్చాడు..
ఇక అక్కడితో మొదలు వరుసగా వచ్చిన వాళ్ళు వచ్చినట్లే పెవిలియన్ చేరి ఇన్నింగ్స్ ను అల్లకల్లోలం చేశారు. ముఖ్యంగా రిజ్వాన్ ఒత్తిడి ఫీలయ్యి అవుట్ అయ్యాడు. బాబర్ ఆజమ్, రిజ్వాన్ లు క్రీజులో ఉన్న సమయంలో పాక్ స్కోరు 300ల వరకు వెళ్తుందేమో అనేలా ఆడారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు నిలకడగా బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో 200 పరుగులు కూడా చేయలేకపోయారు. సౌద్ షకీల్ 6 పరుగులు, ఇఫ్తికర్ అహ్మద్ 4 పరుగులు, షదబ్ ఖాన్ రెండు పరుగులు, మహమ్మద్ నవాజ్ నాలుగు పరుగులు, హసన్ అలీ 12 పరుగులు, షాహిన్ అఫ్రిది రెండు పరుగులు, హరీష్ రౌఫ్ రెండు పరుగులు చేసి ఔటయ్యారు. ఇలా చివరకు పాక్ జట్టు తీవ్ర ఒత్తిడికి లోనై 36 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.