పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు న్యూజిలాండ్ 359 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 255 పరుగులకు ఆలౌటైంది.
ఈ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు టామ్ లేథమ్ (86), గ్లెన్ ఫిలిప్స్ (48*), టామ్ బ్లండెల్ (41) రాణించారు. పది వికెట్లను స్పిన్నర్లే తీయడం గమనార్హం. భారత బౌలర్లు సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. స్పిన్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై భారీ లక్ష్యం ఛేదించడం టీమ్ఇండియాకు సవాలే. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 పరుగులు చేయగా.. భారత్ 156 రన్స్‌కే ఆలౌటైన సంగతి తెలిసిందే.
- Advertisement -