చైనా. – ఆసియా గేమ్స్ లో క్రికెట్ విభాగంలో . నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. . దీంతో ఆసియా క్రీడల్లో సెమీస్‌కు దూసుకెళ్లింది. మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ గైక్వాడ్ బ్యాటింగ్ ఎంచుకుని నేపాల్ ముందు 213 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇండియా ఆటగాళ్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 49 బంతుల్లో 8 ఫోర్లు మరియు 7 సిక్సులు సహాయంతో 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇతనికి గైక్వాడ్ 25, శివమ్ దుబే 25 మరియు రింకు సింగ్ 37 ల నుండి చక్కని సహకారం లభించింది. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్ కూడా దూకుడుగానే ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 179/9 స్కోరుకు పరిమితమైంది. దీంతో 23 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. హ్యాట్రిక్ సిక్స్‌ల దీపేంద్ర సింగ్ ఐరీ (32) ఆ జట్టులో టాప్ స్కోరర్ కావడం గమనార్హం. భారత బౌలర్లు రవి బిష్ణోయ్ 3, అవేశ్ ఖాన్ 3, అర్ష్‌దీప్ సింగ్ 2, సాయి కిశోర్ ఒక వికెట్ పడగొట్టారు
.