తొలి రెండుటెస్టుల్లో భారీ స్కోర్ చేయలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగులు వద్ద నాలుగో వికెట్ గా ఔటయ్యాడు. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్ శతకంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 11వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. టీ సెషన్ తర్వాత రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో రెండు రన్స్ తీసిన రోహిత్ వంద పూర్తి చేసుకున్నాడు. దాంతో ఓపెనర్‌గా మూడో సెంచరీ బాదిన నాలుగో భారత క్రికెటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు విజయ్ మర్చంట్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ లు ఈ ఫీట్ సాధించారు.
రాజ్‌కోట్ టెస్టులో మరో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును రవీంద్ర జడేజా(68)తో కలిసి ఆదుకున్నాడు. లంచ్ తర్వాత బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడంతో ఇద్దరూ దూకుడుగా ఆడారు. విశేషం ఏంటంటే.. ఈ సిరీస్‌లో ఒక సెషన్‌లో భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడం ఇదే మొదటిసారి.