Tuesday, November 19, 2024

IND vs ENG | ఇంగ్లండ్‌ను త‌క్కువ అంచ‌నా వేస్తే… !

టీ20 వరల్డ్ కప్‌-2024 క్లైమాక్స్‌కు చేరింది. మునుపెన్నడూ లేని విధంగా 20 జట్లు పాల్గొన్న ఈ మెగాటోర్నీలో లీగ్ స్టేజ్‌లోనే అంచనాలు తారుమారయ్యాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్ వంటి జట్లు తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాయి. ఇక సూపర్-8 దశలో సంచలనాలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాను అఫ్గానిస్థాన్ ఇంటికి పంపి సెమీఫైనల్స్‌కు చేరింది. అందరూ ఊహించినట్లుగానే భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా కూడా సెమీస్‌కు అర్హత సాధించించాయి.

ఇక రేపు (గురువారం) రెండు సెమీఫైనల్స్ జరగనున్నాయి. తొలుత దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. గయానా వేదికగా గురువారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

రికార్డులు, బలబలాల పరంగా చూస్తే భారత్-ఇంగ్లండ్ సమవుజ్జీలే. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 12 మ్యాచ్‌ల్లో, ఇంగ్లిండ్ జట్టు 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించాయి.

అయితే గత టీ20 వరల్డ్ కప్-2022లో భారత్‌-ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. 16 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఇంగ్లిండ్ జట్టు ఘన విజయం సాధించి టీమిండియాను ఇంటికి పంపింది. అయితే భారత్‌ను ఓడించండం ఈసారి అంత తేలికైన విషయం కాదని ఇంగ్లండ్‌కు తెలుసు. ఈ నేపథ్యంలో రోహిత్ సేనకు మరోసారి షాక్ ఇవ్వడానికి ఇంగ్లండ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానికి తగ్గట్లుగా జట్టు కూర్పు రెడీ చేస్తోంది. జట్టు నిండా భారీ హిట్టర్లతో నింపనుంది.

భారత్‌తో జరిగే సెమీస్‌లో ఫిలిప్ సాల్ట్‌తో కలిసి జోస్ బట్లర్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. వీరిద్దరు విధ్వంసానికి మారుపేరు. ఐపీఎల్ నుంచి సాల్ట్ అదే జోరు కొనసాగిస్తున్నాడు. తాజాగా బట్లర్ సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ బరిలోకి దిగనున్నారు. ఈ ముగ్గురు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగలరు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించడానికి లివింగ్‌స్టోన్, సామ్ కరన్ రెడీగా ఉన్నారు. ఇలా టాప్-7లో అందరూ మోన్‌స్టర్సే ఉన్నారు.

- Advertisement -

అప్పటికీ ఇంగ్లండ్ వికెట్లు కోల్పోతే క్రిస్ట్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్ కూడా బ్యాటుకు పనిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఆటగాళ్లంతా బ్యాటుతో పాటు బంతితోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పగలరు. ఇక స్పిన్ బాధ్యతలను ఆదిల్ రషీద్ చూసుకోనున్నాడు. ఈ టోర్నీలో రషీద్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టోప్లేతో పాటు ఆర్చర్ కొత్తబంతిని అందుకోనున్నాడు. ఇక మూడో పేసర్‌గా క్రిస్ జోర్డాన్ లేదా మార్క్‌వుడ్‌లో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు.

ఇంగ్లండ్ తుది జట్టు (అంచనా)

జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్/మార్క్‌వుడ్, టోప్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement