Friday, November 22, 2024

Ind vs Eng, 5th Test : ఆఖ‌రి టెస్టులోనూ ఇంగ్లండ్ కు ఘోర ప‌రాభ‌వం

అశ్విన్, కుల‌దీప్ స్పిన్ ఉచ్చులో ప‌డిన ఇంగ్లండ్ చివ‌రి టెస్ట్ లోనూ ఘోర ఓట‌మి పాలైంది.. టీమ్ ఇండియా ఏకంగా ఇన్నింగ్స్ 65 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చేసి 4 – 1 సిరీస్ ను కైవసం చేసుకుంది.. టీమిండియా బౌల‌ర్ల ధాటికి ఇంగ్లండ్ జ‌ట్టు బ్యాటింగ్ కుప్ప‌కూలింది. ఒక్క‌రోజు కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయ‌లేక ఇంగ్లండ్ బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. ఐదు రోజులు జ‌ర‌గాల్సిన టెస్ట్ మ్యాచ్ మూడో రోజు టీ లోపలే ముగిసిపోయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో జోరూట్ ఒక్క‌డే 84 ప‌రుగులు చేయ‌గ‌లిగాడు. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్ అయిదు వికెట్లు ప‌డ‌గొట్టి ఇంగ్లండ్ ప‌త‌నాన్ని శాసించాడు.. ఇక ఈ సిరీస్ మొత్తంలో 712 ప‌రుగులు చేసిన య‌వ సంచ‌ల‌నం య‌శ‌స్వీజైశ్వాల్ కు సిరీస్ ఆఫ్ ద ప్లేయ‌ర్ పురస్కారం ల‌భించింది..

ధర్మశాలలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ జ‌ట్టు ఘోర ప‌రాభ‌వం పాలైంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ కే సిరీస్ ను సొంతం చేసుకున్న ఇండియా జ‌ట్టు… చివ‌రి టెస్ట్ మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ పై ఘ‌న విజ‌యం సాధించింది. భారత్ జట్టు ఇన్నింగ్స్ అండ్ 64 పరుగుల తేడాతో ఇండియా జ‌ట్టు విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

టీమిండియా బౌల‌ర్ల ధాటికి ఇంగ్లండ్ జ‌ట్టు బ్యాటింగ్ కుప్ప‌కూలింది. ఒక్క‌రోజు కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయ‌లేక ఇంగ్లండ్ బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. ఐదు రోజులు జ‌ర‌గాల్సిన టెస్ట్ మ్యాచ్ మూడో రోజు టీ లోపలే ముగిసిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు 477 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు 195 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ జట్టు ఇన్నింగ్స్ అండ్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

భారత్ బౌలర్ల విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ లో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీయగా, రెండో ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా రెండు, కుల్దీప్ యాదవ్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు.

- Advertisement -

భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ 103 పరుగులు, శుభమాన్ గిల్ 110 పరుగులు చేయగా, దేవదత్ పడిక్కల్ 65, జైస్వాల్ 57 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 56 పరుగులు, కుల్దీప్ యాదవ్ 30 పరుగులు, బుమ్రా 20 పరుగులు చేశారు.

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు మొదటి ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే 79 పరుగులు, జానీ బెయిర్ స్టో 29 పరుగులు, డకెట్ 27 పరుగులు, రూట్ 26 పరుగులు, ఫోక్స్ 24 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో జోరూట్ 84 పరుగులు, జానీ బెయిర్ స్టో 39 పరుగులు, హార్ట్ లీ 20 పరుగులు, ఒల్లీ పోప్ 19 పరుగులు చేశారు.

ఈ టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్ లలో 9వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 7 వికెట్లు తీసి భారత్ జట్టుకు ఘన విజయాన్ని అందించారు. ఇండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు కుప్పకూలారు.

ఇక ప్లేయ‌ర్ ఆప్ ద మ్యాచ్ ఏడు వికెట్లు తీసిన కుల‌దీప్ యాద‌వ్ కు ద‌క్కింది.. 712 ప‌రుగులు చేసిన య‌శ‌స్వీ జైస్వాల్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కైవసం చేసుకున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement