విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ 253 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు కీలక ఆధిక్యం లభించింది. మూడో సెషన్‌కు ముందు 155-4తో ఉన్న ఇంగ్లండ్‌ను బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లు దెబ్బతీశారు.
ఈ టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆతర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 143 పరుగుల ఆధిక్యంలో ఉంది.
టీ విరామానికి 33 ఓవర్లలో 155-4గా ఉన్న ఇంగ్లండ్.. ఆ తర్వాత 22.5 ఓవర్లు మాత్రమే ఆడింది. మూడో సెషన్‌కు వచ్చిన ఇంగ్లండ్‌కు సెషన్ రెండో ఓవర్లోనే బుమ్రా షాకిచ్చాడు. బుమ్రా వేసిన బంతి బెయిర్ స్టో బ్యాట్‌ను ముద్దాడుతూ స్లిప్స్‌లో గిల్ చేతికి చిక్కాడు. బెయిర్ స్టో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ ఫోక్స్ (6)ను కుల్దీప్ 38 ఓవర్లో రెండో బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ 42వ ఓవర్లో మూడో బంతికి రిహన్ అహ్మద్‌ను ఔట్ చేశాడు.
182 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ స్కోరుబోర్డును బెన్ స్టోక్స్ – టామ్ హర్ట్లీ (21) ముందుకు నడిపించారు. ఈ ఇద్దరూ 8వ వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఈ జోడీని బుమ్రా విడదీశాడు. అతడు వేసిన 49వ ఓవర్లో రెండో బంతికి స్టోక్స్‌ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే హర్ట్‌లీని పెవిలియన్‌కు పంపడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఫైఫర్ (ఐదు వికెట్ల ఘనత) సాధించాడు. టెస్టులలో బుమ్రాకు ఇది పదో ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. ఆఖర్లో అండర్సన్ (6)ను కూడా బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా ఈ మ్యాచ్ లో 45 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు.. కుల్ దీప్ మూడు, అక్షర్ కు ఒక వికెట్ దక్కాయి..