నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ మద్య నేటి నుంచి పొట్టి క్రికేట్ సమరానికి తెరలేవనుంది. గుజరాత్ లోని నరేంద్ర మోదీ మైదానంలో ఐదు టీట్వంటీల సిరీస్ ఆరంభం కానుంది. ఈ ఏడాది టీట్వంటీ వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఫార్మాట్లో నెంబర్1,2 జట్ల మధ్య జరిగే ఈ పోరు అభిమానులను అలరించనుంది. టెస్టు సిరీస్ ను 3-1తో గెలిచిన భారత్ తమ జోరును ఈ ఫార్మాట్లోనూ చూపాలనుకుంటోంది. అలాగే స్వదేశంలో అక్టోబరు నుంచి జరిగే టీట్వంటీ ప్రపంచక్‌పను దృష్టిలో ఉంచుకుని చక్కటి కోర్ గ్రూపును రూపొందించుకోవాలని చూస్తోంది. ఇక ఇగ్లాండ్ టీం పక్కా టీట్వంటీ ఆటగాళ్లతో భరిలోకి దిగనుంది. ఎలాగూ ఇక్కడే మెగా టోర్నీ జరుగుతుంది కాబట్టి ఈ వాతావరణానికి అలవాటు పడడం కూడా వారికి కలిసి వచ్చే విషయం.
పొట్టి ఫార్మాట్లో భారత ఓపెనర్లు ఎవరనేది కెప్టెన్ కోహ్లీ మ్యాచ్‌కు ముందే స్పష్టం చేశాడు. ఫామ్‌లో ఉన్న రాహుల్ కి తోడుగా ధావన్ బరిలోకి దిగుతాడని. ధవన్ రిజర్వ్ ఓపెనర్‌గా ఉంటాడని అతడు స్పష్టం చేశాడు. దీంతో ఊహాగానాలకు తెర పడి నట్టయింది. అలాగే వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ ఆడడం కూడా ఖాయమైపోయింది. ఇక కీలకమైన నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను పరీక్షించే అవకాశం కనిపిస్తోంది. ఇక పించ్ హిట్టర్లుగా రిషబ్ పంత్, పాండ్య ఉండనే ఉన్నారు. చాలా రోజుల తర్వాతా పేస్ బౌలర్ భవీ ఆడనున్నాడు. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికొస్తే ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో జోరుగా దూసుకుపోతున్న డెవిడ్ మాలాన్ చాలా కీలక కానున్నాడు. బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, మోర్గాన్‌తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. బౌలింగ్ లోను ఇంగ్లాండు టీం బలంగా కనిపిస్తోంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభకానుంది.