Friday, November 22, 2024

IND vs BAN : తొలిటెస్టులో భార‌త్ ఘ‌న‌ విజయం..

బంగ్లాదేశ్ తో చెన్నయ్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ ఘ‌న‌ విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 234 పరుగులకు ఆలౌటైంది. 158/4 వ ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ అశ్విన్ స్పిన్ ఉచ్చులో చిక్కు కుంది. అశ్విన్ 6 వికెట్లతో చెలరేగాడు. అశ్విన్‌తో పాటు జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ శాంటో(82) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

టీమ్ ఇండియా ఓవర్ నైట్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 81 పరుగులుతో మూడో రోజు ఆట ప్రారంభించింది. శుభ్ మన్ గిల్ (33), రిషబ్ పంత్ (12) ఇద్దరూ సాధికారికంగా ఆడి సెంచరీలు చేశారు. పంత్ అయితే వన్డే తరహాలో ధనాధన్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

అనంతరం శుభ్ మన్ గిల్ కూడా ఈ ఇన్నింగ్స్ జీవన్మరణ పోరాటంగా భావించి ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ కావడంతో …పట్టుదలగా ఆడాడు. 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 119 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివరికి కేల్ రాహుల్ (22) సాయంతో స్కోరుని 287 పరుగులకి చేర్చాడు. అప్పటికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపి 514 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా దేశ్ చేతిలో ఉంచి డిక్లేర్ చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 234 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. దీంతో భార‌త్ జ‌ట్టు 280 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement