బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ 376 రన్స్‌కు ఆలౌటైంది. రెండో రోజు ఉదయం సెషన్లో ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయింది. బంగ్లా బౌలర్ తస్కిన్ రెండో రోజు మూడు వికెట్లను తీసుకున్నాడు. ఇది ఇలా ఉంటే , బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ను బుమ్రా తొలి దెబ్బ తీశాడు.. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ ను ఔట్ చేశాడు.. షాద్మన్ రెండు పరుగులకు పెవిలియన్ కు చేరాడు..
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో స్పీడ్‌స్టర్ హసన్ అహ్మద్ తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. రెండో రోజు బుమ్రా వికెట్‌ను తీశాడతను. పేసర్లు తస్కిన్, హసన్‌లు తమ ఖాతాలో 8 వికెట్లు వేసుకున్నారు.
తొలి రోజు ఆరు వికెట్లకు 339 రన్స్ చేసిన ఇండియా.. రెండో రోజు కేవలం 37 పరుగులు మాత్రమే జోడించి చివరి 4 వికెట్లను చేజార్చుకున్నది. సెంచరీకి చేరువు అవుతున్న జడేజా తొలుత అవుటయ్యాడు. అతను 86 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ 17 రన్స్ చేసి క్యాచ్ అవుటయ్యాడు. చివరకు అశ్విన్ కూడా తస్కిన్ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లాడు. అశ్విన్ 113 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి.