భారత్-ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టును ఇంగ్లండ్ గెలుచుకోగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టును టీమిండియా సొంతం చేసుకొని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టెస్టుల్లో ఇరు జట్లు కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాయి. కానీ టీమిండియాకు గాయాల బెడద వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు వరుసగా దూరమవుతున్నారు.
వ్యక్తిగత కారణాలతో కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకోగా.. ప్రపంచకప్ హీరో మహ్మద్ షీమీ ఇంకా కోలుకోలేదు. తాజాగా.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా గాయాలతో మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఇలాంటి సమయంలో యువ ఆటగాళ్లతోనే కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాను ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది.
అయితే, మూడో టెస్టు మ్యాచ్ కు తుది జట్టులోకి జడేజ చేరే అవకాశాలు ఉన్నాయి. రవీంద్ర జడేజా టీమిండియా సభ్యులతో ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా రాజ్ కోట్ టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. దీంతో ఈ ఇద్దరు ప్లేయర్స్ మూడో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.