Friday, November 22, 2024

Ind-Eng 2nd test | రేపటి నుంచే భారత్‌-ఇంగ్లండ్ మ్యాచ్‌!

హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 28 పరుగులతో ఓడిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టు కోసం కఠిన సాధన చేస్తోంది. రేపటి (శుక్రవారం) నుంచి విశాఖపట్నం వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ సిరీస్‌లో 0-1తో వెనుకబడిన టీమిండియా విశాఖ టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. కానీ భారత జట్టుకు గాయాల బాధ వెంటాడుతోంది. టోర్నీ ఆరంభానికి ముందు విరాట్‌ కోహ్లీ తప్పుకోగా.. తాజాగా కేఎల్‌ రాహుల్‌, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాలు గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు.

ఇప్పుడు కేఎల్‌ రాహుల్‌ స్థానంలో తుది జట్టులో ఎవరినీ ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ నాలుగో స్థానం కోసం సర్ఫరాజ్‌ ఖాన్‌, రజత్‌ పటీదర్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దేశవాళీ క్రికెట్‌లో వీరిద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో చిరస్మరణీయ ఆటతో అందరి దృష్టి ఆకర్షించాడు.

సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇప్పటీవరకు 45 మ్యాచ్‌ల్లో 69.85 సగటుతో 3912 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు, 11 హాఫ్‌ సెంరీలు ఉన్నాయి. ఇంగ్లండ్‌ లయన్స్‌తో ఇటీవల జరిగిన అనధికరిక టెస్టులో సర్ఫరాజ్‌ వరుసగా 96, 55, 4, 161 పరుగులతో రాణించాడు. ఈ ముంబై క్రికెటర్‌ గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత ఇతనికి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. ఇక విశాఖ టెస్టులో అరంగేట్రం చేసేందకు ఆతృతగా ఉన్నాడు.

మరోవైపు రజత్‌ పటీదార్‌కు కూడా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఘన చరిత్ర ఉంది. 55 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన రజత్‌ 45.97 సగటుతో 4వేల పరుగులు చేశాడు. అందులో 12 శతకాలు ఉన్నాయి. ఇటీవల ఇంగ్లండ్‌ లాయన్స్‌తో జరిగిన అనధికారిక మ్యాచ్‌లో భారత్‌-ఏకే ప్రాతినిథ్యం వహించిన పటీదార్‌ (111, 151) రెండు సెంచరీలు నమోదు చేశాడు. మొత్తంగా ఇద్దరి ప్రదర్శన అద్భుతంగా ఉంది. వీరిలో భారత సెలక్టర్లు ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement