ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్-ఏ జట్టు సత్తాచాటుతోంది. ‘ఆస్ట్రేలియా-ఏ’తో జరుగుతున్న తొలి టెస్టులో బ్యాటర్లు తడబడినా బౌలర్లు గొప్పగా పోరాడి జట్టును తిరిగి పోటీలోకి తెచ్చారు. ముకేశ్ కుమార్ ఆరు వికెట్లతో విజృంభించాడు. ముకేశ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ కూడా మూడు వికెట్లతో చెలరేగడంతో ఆస్ట్రేలియా-ఏ 62.4 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది.
అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 47.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ముకేశ్ కుమారర్ తొలి ఓవర్‌లోనే ఆస్ట్రేలియా దెబ్బకొట్టాడు. ఓపెనర్ శామ్‌ను డకౌట్ చేశాడు. మరో ఎండ్‌లో ప్రసిధ్ కృష్ణ కూడా వికెట్ల వేట మొదలుపెట్టడంతో ఆసీస్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ నాథన్ (39), వెబ్‌స్టర్ (33) ఇన్నింగ్స్ చక్కదిద్దాడానికి ప్రయత్నించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వెబ్‌స్టర్‌ను ముకేశ్ ఔట్ చేసినప్పటికీ కూపర్ (37)తో కలిసి నాథన్ అయిదో వికెట్‌కు అర్ధశతకం భాగస్వామ్యం నమోదుచేశాడు.
దీంతో 124/4తో ఆసీస్ మ్యాచ్‌పై పట్టుబిగించింది. అయితే భారత బౌలర్లు తిరిగి పుంజుకుని క్రమంగా వికెట్లు తీశారు. ఆఖర్లో టాడ్ ముర్ఫి (33) కీలక పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో ముకేశ్ (6/46), ప్రసిధ్ కృష్ణ (3/59), నితీశ్ కుమార్ రెడ్డి (1/14) ఒక్క వికెట్ తీశారు.
కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దేవదత్ పడిక్కల్ (36) టాప్ స్కోరర్. ఆఖర్లో నవదీప్ సైని (23) పోరాటంతో భారత్-ఏ జట్టు 100 పరుగుల మార్క్‌ను దాటింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రెండాన్ డాగెట్ ఆరు వికెట్లతో చెలరేగాడు. జోర్డాన్ బెకింగ్‌హమ్ రెండు వికెట్లు, ఫెర్గస్, టాడ్ ముర్ఫి తలో వికెట్ తీశారు.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్-ఏ గొప్పగా బ్యాటింగ్ చేస్తోంది. 118 పరుగుల వెనుకంజతో బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. క్రీజులో సాయి సుదర్శన్ 96, దేవదత్ పడిక్కల్ 80 పరుగులతో ఉన్నారు.