ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ 60వ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ పరాజయం పాలయ్యింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ని 16 ఓవర్లకు కుదించారు. అయితే.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబయి.. కోల్‌కతాని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.. ఇక.. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 157 పరుగులు చేసింది. దీంతో ముంబయి టార్గెట్ 158 పరుగులు ఉంది. బ్యాటింగ్‌లో ముంబయి పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. దీంతో 18 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. ఇక.. 12 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా.. 9 మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్స్ పట్టికలో టేబుల్ టాపర్‌గా నిలిచి.. 18 పాయింట్లతో ప్లే ఆప్స్‌కి దూసుకెళ్లింది.
కాగా, ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (40), రోహిత్ శర్మ (19), సూర్య కుమార్ యాదవ్ (11), తిలక్ వర్మ (32), హార్దిక్ పాండ్యా ( 2), టిమ్ డేవిడ్ (0), వధేరా (3), నమాన్ ధిర్ (17) పరుగులు మాత్రమే చేయగా.. పీయూష్ చావ్లా 1, కాంబోజ్ 2 నాటౌట్‌గా నిలిచారు.
కాగా, చివరలో తిలక్ వర్మ దంచికొడుతున్న తరుణంలో హర్షిత్ రాణా వేసిన బాల్కి బౌండరీ బాదబోయి కీపర్ పిల్ సాల్ట్ చేతికి అడ్డంగా చిక్కాడు.. దీంతో ముంబయి ఆట అంతటితో ముగిసినట్టు అయ్యింది.. ఆ తర్వాత వచ్చిన టెయిలెండర్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు..
ఇక.. అంతకుముందు ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో కోల్‌కతా ఆదిలోనే కష్టాల్లో పడింది. ముంబయి ఇండియన్స్ పేసర్ల విజృంభణతో 10 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే డేంజరస్ ఫిలిప్ సాల్ట్(6)ను తుషార వెనక్కి పంపాడు. ఈ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్(0)ను బమ్రా బౌల్డ్ చేశాడు. దాంతో, నరైన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్(42) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(7)తో కీలక పరుగులు చేశాడు.
ముంబయి అంటేనే విరుచుకుపడే వెంకటేశ్ సారథితో కలిసి మూడో వికెట్‌కు 30 రన్స్ జోడించారు. అయితే.. ఐదో ఓవర్ తొలి బంతికే అయ్యర్‌ను బౌల్డ్ చేసి కోల్‌కతాను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రానా(33), ఆండ్రూ రస్సెల్(24) వేగంగా ఆడి ఐదో వికెట్‌కు 39 రన్స్ రాబట్టారు. ఆఖర్లో రింకూ సింగ్(20) తన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. బుమ్రా 16వ ఓవర్లో రింకూను ఔట్ చేసినా.. రమన్‌దీప్ సింగ్(17 నాటౌట్) ఆరో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దాంతో, కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 157 రన్స్ చేయగలిగింది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(239), పీయూష్ చావ్లా(228)లు రెండేసి వికెట్లు పడగొట్టారు..