Monday, November 18, 2024

ఫ్రెంచ్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్ గెలుచుకున్న‌ అరెవాలో, రోజర్‌..

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో అరెవాలో- రోజర్‌ జోడీ అద్భుతంగా రాణించింది. ఎల్‌ సాల్వడార్‌ దేశానికి చెందిన మార్సెలో అరెవాలో, నెదర్లాండ్స్‌కు చెందిన జీన్‌-జూలియన్‌ రోజర్‌ జంట ప్రత్యర్థి ఇవాన్‌ డోడింగ్‌ (కొయేషియా), ఆస్టిన్‌ క్రాజిసెక్‌ (అమెరికా) జోడీపై 6-7(4), 7-6(5), 6-3 తేడాతో విజయం సాధించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మెన్స్‌ డబుల్స్‌ టైటిల్‌ గెలిచింది. 40ఏళ్ల రోజర్‌ ప్రస్తుతం తరంలో అత్యధిక వయసులో గ్రాండ్‌ స్లామ్‌ పురుషుల డబుల్స్‌ ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌గా నిలిచాడు. అతను 2017 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో హోరియా టెకావుతో కలిసి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అంతర్జాతీయ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ప్రకారం.. అరెవాలో సెంట్రల్‌ అమెరికా నుంచి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను గెలిచిన తొలి వ్యక్తిగా నిలిచాడు.
అరెవాలో, రోజర్‌ 12వ సీడెడ్‌ ప్లేయర్లు కాగా.. ప్రత్యర్థులైన డోడిగ్‌, క్రాజిసెక్‌ సీడెడ్‌ ప్లేయర్లు కారు. ఇకపోతే రెండో సెట్‌లో డోడిగ్‌, క్రాజిసెక్‌ 6-5తో నిలిచి టైటిల్‌ ముద్దాడే క్షణాలకు చేరువ కాగా.. అరెవాలో, జీన్‌ జూలియన్‌ రోజర్‌ జంట భీకరంగా పుంజుకుంది. అతి కష్టమ్మీద రెండో సెట్‌ గెలిచిన అనంతరం.. మూడో సెట్‌ 6-3తేడాతో అలవోకగా గెలిచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement